Breaking News

అమ్మో .....గాలిలో కరోనా వైరస్?

కరోనా విషయంలో మరో ఆందోళన కరమైన వార్త వెలుగు చూసింది. ఇంత కాలం మనిషి నుండి మనిషికి  దగ్గినపుడో లేదా తుమ్మినపుడో సోకుతుందనేే అందరూ నమ్ముతూ వచ్చారు. కాని కొత్తగా తెల్సిన విషయం ఏమంటో గాలిలోని తుంపర్లలో కూడ ఈ వైరస్ ఉందని నిర్దారించారు.  వుహాన్‌లో గాలిలోని తుంపర్లలోనూ వైరస్ జాడలను గుర్తించారు. ఇక్కడి రెండు ఆసుపత్రులలోని గాలిలోని తుంపర్లలో వీటిని గుర్తించినట్టు నేచర్ పత్రికలో ప్రచురితమైన కథనం కలకలం రేపుతోంది
వుహాన్‌లోని రెన్మిన్ ఆసుపత్రితోపాటు కోవిడ్ బాధితులను క్వారంటైన్ చేసిన తాత్కాలిక కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు గాలి నమూనాలను సేకరించారు. వీటితోపాటు ఓ నివాస సముదాయం, సూపర్ మార్కెట్, రెండు డిపార్ట్‌మెంటల్ స్టోర్ల నుంచి కూడా గాలి నమూనాలను సేకరించి విశ్లేషించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి గాలి నమూనాల్లో కరోనా వైరస్ జాడలను గుర్తించారు.

ఆసుపత్రుల్లో జనం ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలు, ఐసోలేషన్ వార్డులు, బాధితుల గదులు, గాలి సరిగా ఆడని మరుగుదొడ్లలోని గాలిలో కొద్ది స్థాయిలో వైరస్ జాడలు ఉన్నట్టు గుర్తించారు. మిగతా ప్రాంతాల నుంచి సేకరించిన గాలి నమూనాల్లో మాత్రం వైరస్ జాడలు కనిపించలేదు. అయితే, గాలిలోని వైరస్ మనుషులపై ఏమాత్రం ప్రభావం చూపిస్తుందన్న విషయం శాస్ర్త వేత్తలు తేల్చాల్సి ఉంది. ఇందుకోసం ఇంకా పరిశోదనలు జరగాల్సి ఉంది.

No comments