Breaking News

కరోనా యోధులపై పూల వర్షం కురిపించిన దేశ పహారా సైన్యం

కరోనా నివారణ యుద్దంలో  ప్రాణాలొడ్డి పోరాడుతున్న వైద్యులు,వైద్య సిబ్బంది,పోలీసులు,పారిశుద్య కార్మిక సిబ్బందికి అరుదైన గౌరవం లభించింది.త్రివిద దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రకటించిన మేరకు ఆదివారం దేశ వ్యాప్తంగా వివిద ప్రాంతాలలో  వైమానిక దళం విమానాల ద్వారా పూలవర్షం కురిపించారు.
ఢిల్లీ పోలీస్‌ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి సమర్పించి వందన సమర్పరణతో కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. పోలీసు సేవలకు ప్రశంసగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన చాపర్‌ పోలీస్‌ వార్‌ మెమోరియల్‌పై పూలవర్షం కురింపించింది.
దేశ రాజధాని ఢిల్లీలో సర్ గంగా రామన్ ఆసుపత్రి,రాజీవ్ గాంధి సూపర్ స్పెషాల్టి ఆసుపత్రి, దీనదయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రి పై పూల వర్షం కురిపించారు.ఎంతో ఉత్తేజితంగా కొనసాగిన ఈ కార్యక్రమం నిర్ణీత వేళల్లే ఆయా ప్రాంతాలలో జరిగింది. తెలంగాణ రాష్ర్టంలో కరోనా వ్యాధి నియంత్రణకు కేంద్రంగా మారిన గాంధి ఆసుపత్రిపై హెలికాప్టర్ ద్వారా పూల  వాన కురిపించారు.ఆసుపత్రి ఆవరణలో డాక్ర్ జయశంకర్ విగ్రహం వద్ద జమ కూడిన పోలీసులు, వైద్యులు, పారామెడికల్‌, పారిశుద్య సిబ్బంది పై వాయుసేన హెలికాప్టర్‌ ద్వారా పూలవర్షం కురిపించారు. యుసేన పూలవర్షం కురిపించినందుకు ఉత్తేజం పొందిన వైద్యులు ఇతర సేవల సిబ్బంది చప్పట్లు కొట్టి తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. సిటి పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ సహా  పలువురు పోలీస్ అధికారులు , వైద్యాధికారులు పాల్గొన్నారు.

No comments