Breaking News

క్లోమవ్యాధి ఔషధాలతో కొవిడ్‌కు చెక్‌

లండన్‌:క్లోమ వ్యాధి(పాంక్రియాటైటిస్‌) చికిత్సలో వాడే ఔషధాలు కరోనా చికిత్సకూ ఉపయోగపడతాయని యూకేలోని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. క్యామోస్టాట్‌, నఫామోస్టాట్‌ అనే మందులు కరోనా వైర్‌సను ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటాయని వారు చెబుతున్నారు. కరోనా వైరస్‌ ప్రధానంగా టీఎంపీఆర్‌ఎ్‌సఎస్‌ 2 అనే ప్రొటీన్‌ను టార్గెట్‌ చేసుకొని మనుషుల కణాల్లోకి ప్రవేశిస్తుంది. శాస్త్రవేత్తలు చెబుతున్న ఔషధాలు కరోనా వైర్‌సను ఇక్కడే అడ్డుకొని, కణాల నుంచి ఊపిరితిత్తుల ప్రవేశమార్గంలోకి వెళ్లకుండా నిరోధిస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. తద్వారా కరోనా ప్రభావాన్ని చాలావరకు తగ్గించవచ్చన్నారు. వీటిని త్వరలో కరోనా రోగులపై ప్రయోగిస్తామన్నారు.

No comments