Breaking News

*భారతీయ తత్వశాస్త్రం.* *27* (Indian Philosophy) *అవైదికదర్శనాలు.*


 (కొన్ని భౌతిక దర్శనాలు : బౌద్ధ దర్శనం.)
                      బుద్ధ చరిత్ర.
                   నమస్కారం.
   దానిని ఆచరణలో సాధించుట.*
  *
     బుద్దుడు ఒకసారి దేశపర్యటన చేస్తున్నప్పుడు 'సిగాలా' అనే వర్తకుడు తారస పడ్డాడు.
     అతను నాలుగు దిక్కులకు చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాడు. ఆకాశం వైపు నమస్కరించాడు. నేలమీద పడుకుని నమస్కరించాడు.
     *బుద్దుడు:-* అన్ని నమస్కారాలు ఎందుకు చేస్తున్నావని సిగాలాను బుద్దుడు ప్రశ్నించాడు.
      *సిగాలా:-*"ఏమో, నాకేం తెలుసు. చిన్నప్పుడు మా నాన్న అలా చేయాలని చెప్పాడు. అందుకే ఇలా చేస్తున్నాను. ప్రతిరోజు ప్రాతఃకాలంలో నమస్కారాలు చేయడం నాకు అలవాటు" అని బుద్దునితో అన్నాడు.
     *బుద్దుడు:-*"అలాకాదు సిగాలా! ఏ పని చేస్తున్నా అర్థం, పరమార్థం తెలుసుకుని చేయాలి. లేకపోతే ఫలితం ఉండదు.
      *సిగాలా:-* అలా ఇయితే, నమస్కారాల అర్థం వివరించండి మహాశయా!
     *బుద్దుడు:-*తూర్పు దిక్కుకు నమస్కరిస్తే మన తల్లిదండ్రులకు నమస్కరించినట్లు. మనిషికి తల్లిదండ్రుల ఋణం గొప్పది. అందు వలన రోజు నమస్కరించి కృతజ్ఞతలు చెప్పవలెను.
      దక్షిణ దిక్కుకు నమస్కరిస్తే గురుపరంపరకు నమస్కరించినట్లు. గురువులను గౌరవించాలి.
      పశ్చిమ దిక్కు నమస్కారం భార్యబిడ్డలపై ప్రేమకు చిహ్నం. భార్యబిడ్డల ఆలనాపాలనా చూడాలి.
      ఉత్తర దిక్కు నమస్కారం బంధుమిత్రుల ఆదరణకు కృతజ్ఞత చెప్పడం. బంధుమిత్రులను ఎప్పడూ దూరం చేసుకోకూడదు.
      భూమికి నమస్కారం చేయడమం అంటే సాటివారి ఆదరణకు కృతజ్ఞత తెలపడం.
      ఆకాశం వైపు నమస్కరించడం మన పూర్వీకులైన మహర్షులకు, ప్రస్థుత ఉన్న మహాత్ములకు ఆశీస్సులు కోరుతూ, కృతజ్ఞతలు తెలపడం.
     *సిగాలా:-* నమస్కారం గురించి ఈ విషయాలు నాకు తెలియదు మహాత్మా! వీటి గురించి మరింత వివరణ కోరుతున్నాను.
     *బుద్దుడు:-*మనిషి మంచిగా జీవించడం అవసరం సిగాలా! కేవలం పది నిముషాల పాటు నమస్కారాలు పెడితే చాలదు.
      ముందుగా మంచి మిత్రుల్ని సంపాదించుకోవాలి. అది గొప్ప సంపదగా భావించాలి.
  *ఎవరు మంచి మిత్రుడంటావా...*
     *(1)*నీ దగ్గర ధనం లేక పోయినా నీకు అండగా ఉండేవాడు.
     *(2)*నీవు ఆనందంగా ఉన్నా, విచారంగా ఉన్నా నీవెంట నడిచేవాడు.
     *(3)*నీ విజయంలో, అపజయంలో భాగం పంచుకునేవాడు.
     *(4)* నీ కష్టాలు, బాధలు సానుభూతితో అర్థం చేసుకుని ఊరడించేవాడు.
     *(5)*నీకు సదా మంచి జరగాలని కాంక్షించేవాడు. -- మిత్రుడు.
               *జీవితంలో మంచిగా
    జీవించడానికి మరిన్నీ సూత్రాలు.*
     *(1)*మంచి ప్రవర్తన గల వారితో స్నేహం చెయ్యాలి. చెడ్డవారితో చెలిమి చేయకూడదు.
     *(2)* మనశ్శాంతికి అనువైన చోట నివాసముండాలి.
     *(3)*మంచి సంగతులు నేర్చుకునే అవకాశం ఎప్పుడూ విడిచి పెట్టకూడదు.
     *(4)* తల్లిదండ్రుల విషయం, భార్యాబిడ్డల విషయం అశ్రద్ద చేయకూడదు.
     *(5)* ఇతరులతో నీ ఆనందాన్ని పంచు, వారి ఆనందాన్ని నీవు పంచుకోవాలి.
     *6)* తాగుడు, జూదం, వ్యభిచారం పూర్తిగా త్యజించాలి.
     *(7)*వినయం, సచ్ఛీలం, ఔదార్యం, నిరాడంబర జీవితం అలవరచుకోవాలి.
     *(8)*సదా సత్పురుషుల సాంగత్యం అభిలషించాలి. ఏ మాత్రం అవకాశం ఉన్నా, వారి బోధనలు స్వీకరించి, ఆచరించాలి.
     *(9)* న్యాయ బద్దంగా జీవించడం అలవాటు చేసుకోవాలి.
     *(10)* కష్టాలు, బాధలు నివారణ కావడానికి 'ధ్యానం' ఒక్కటే మార్గం. అలవాటు చేసుకుని ప్రతిరోజు ధ్యానం చేయాలి.
       బుద్దుడు ఈ విధంగా సిగాలాకు మంచి మిత్రుడు గురించి, సక్రమ జీవితాచరణంలో పాటించాల్సిన పద్ధతులను గురించి ఉపదేశించాడు.  

                          --- మీ సత్యాన్వేషి .

No comments