Breaking News

ఎకరానికి 4 వేల సబ్సిడీతో రైతాంగానికి ఒరిగేదేమిటి?

రాష్ట్రప్రభుత్వం గతేడాది పత్తి ఎయ్యొద్దు... మిర్చి వెయ్యమని చెప్పి కూడా, 
మిర్చి రైతులను గాలికి ఒదిలేసి,రైతన్నల చేతులకు బేడిలు వేసింది
నేడు చూసినట్లై ప్రతి కార్యక్రమాల్లో ప్రభుత్వ పెద్దల నోటి నుండి వెలువడే మాట *రైతాంగ సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం* అని.
*రైతాంగానికి ఉన్న సమస్యల మూలాలెక్కడ?*
*చూపుతున్న పరిష్కారాలేక్కడ?*
పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, గిట్టుబాటు ధర రాకపోవడం ప్రధాన కారణాలని వేరే చెప్పక్కర్లేదు. 
పెట్టుబడి ఖర్చుల్లో ప్రధానంగా ఎరువుల ఖర్చోకటి, కానీ అదొక్కటే ఖర్చు కాదు. 
ఎరువుల కోసం ఎకరానికి రూ.4000 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
అది కూడా వచ్చే ఆర్ధిక సంవత్సరం నుండి అని తెలిపింది.
ఎకరానికి 4000 ఇవ్వదలుచుకున్న ప్రభుత్వాన్నిఅభినందించాలని కోరుకున్న వాళ్ళు,
అదే ప్రభుత్వం విత్తనాల రేట్లు అమాంతం పెంచడం, అదీ ఈ వానాకాలం నుండే అమలు చేస్తే ప్రభుత్వాన్ని ఖండించాలి కూడా.
 ఇటువంటి ఒక చేత్తో ఇచ్చి, ఇంకో చేత్తో  తీసుకునే పథకం...... అంటే
(ఒక పక్క ఫించన్లు ఇచ్చి ఇంకో పక్కవిపరీతంగా మద్యపానం అమ్మే ప్రభుత్వ ప్రజా సంక్షేమం లాంటిదే.)
*వచ్చే ఏడాది ఇచ్చే ఎకరానికి 4000 గురించి మొదటి పేజీల్లో* వేసి విపరీతమైన ప్రచారం కల్పించి, *విత్తనాల రేట్ల పెంపుదలను ఎక్కడో 7,8 పేజీల్లో* ప్రచురించిన మీడియా ఎవరి కోసం పని చేస్తుందో అర్ధం కావడం లేదు.
ఈ *ప్రభుత్వ పెద్దలు వాళ్ళ జేబుల్లో నుంచి తీసిస్తున్నట్టు* ప్రచారం చేస్తున్నారు.
*అది ప్రజాధనం......అంటే పౌరులైన మనం సమకూర్చిన ఖజాననే*
ఈ పథకం గురించి పొగుడుతున్న కొందరు మేధావులు, మరి అదే ప్రభుత్వం ఈ ఏడాది నుంచే పెంచిన విత్తనాల రేట్ల విషయంలో  విమర్శించడానికి నోర్లు రావడం లేదు..... 
*నిండా మునుగుతున్నోడికి తంగేడు కొమ్మ కనబడ్డా ప్రాణం లేచొచ్చినట్టు*....
 *ఎప్పుడో.... వచ్చే ఏడాది ఇచ్చే  4000 గురించి ఆశగా ఎదురు చూస్తూ, ఆనందపడటం రైతుల అమాయకత్వానికి, నిదర్శనం*.... 
కురుస్తుందో కురవదో తెల్వని వానల కోసం, ప్రతి ఏడాది ఎదురుచూసినట్టే.... 
అసలు వస్తుందో రాదో తెల్వని ఈ 4000 కోసం కూడా ఎదురు చూస్తూన్నారు మన రైతన్నలు.....
 ప్రభుత్వం, వాళ్ళ నోట్లో మన్నుగొట్టకుండా, ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చెయ్యాలి.
కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వడానికి కూడా చేతులు రాని ప్రభుత్వానికి,
 అసలు సాగు చేసే కౌలురైతులకి ఈ పధకాన్ని అమలు చేసే చిత్తశుద్ధి ఏ మాత్రం ఉందొ వేచి చూడాలి. 
ఉచితంగా డబ్బులిస్తే,ఓట్లేస్తారు కదా అనుకుంటే ....
 భూ యజమానులకు గాకుండా, సాగు జేసే వాళ్లకి ఈ పథకం అమలు చేయ్యాలి.
ఈ విధంగా అయిన కౌలు రైతులకు న్యాయం జరుగుతుంది.
*రుణమాఫీ చేయడం ద్వారా మొత్తం రైతులందరూ రుణ విముక్తులయ్యారని, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం* పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగడం వంటిదే.... 
కేవలం *అధికారులు చేసిన తప్పులతో 40,000 మంది రైతులు అసలు రుణమాఫీకే అర్హులు కాలేకపోయారు*.
*వాళ్ళని జాబితాలో చేర్చొద్దని ఆదేశాలిచ్చిన ప్రభుత్వం రైతులను ఉద్ధరించే చిత్త శుద్ధి ఎంతో అర్ధమయితుంది*.
 రుణమాఫీ ద్వారా అసలు ఎంత మంది రైతులు నిజంగా రుణవిముక్తులయ్యారో,
అసలు బ్యాంకు రుణాలకే ఎంత మంది దూరమయ్యారో, ముఖ్యమత్రి గారి దగ్గర సమాచారం ఉన్నట్టు లేదు.
 *ఎన్ని బోర్లున్నా ఉచిత విద్యుత్తు, పాలీ హౌజ్లకి, పూల పందిర్లకి ఉచిత విద్యుత్తు ఇవ్వడం ఎవరినిఉద్దరించడానికి?* 
అసలు *ఎంతమంది చిన్న, సన్నకారు రైతులు ఈ పాలీ హౌసులు పెట్టుకున్నారు?*
*వందల ఎకరాలతో వ్యవసాయ క్షేత్రాలు నడుపుకుంటున్నోల్లని బాగు జేసే, ఈ పథకం కూడా రైతులకోసం అని చెప్పుకుంటున్నారు.*
బడా కార్పొరేట్లని బాగుజేసే,ముందు ముందు రాబోయే కాంట్రాక్టు వ్యవసాయానికి ఇప్పటి నుంచే  పునాదులు వేస్తున్నట్టుకనబడుతుంది.
ప్రపంచమంతా రసాయనాలు లేని, పెట్టుబడి తగ్గించుకునే సేంద్రియ వ్యవసాయం వైపు ప్రయాణిస్తుంది.
 కాని మన ప్రభుత్వం ఎరువుల కోసం డబ్బులివ్వటం ఎలా సమర్ధిస్తారో, వాళ్ళకే తెలవాలి.
 గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సిక్కిం పర్యటనకు వెళ్లి, వాళ్ళు బహ్మండంగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారని,
 మన దగ్గర కూడా ప్రోత్సహిస్తామని చెప్పిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
 ఆర్గానిక్ కూరగాయలు తెస్తే తప్ప ఇంట్లో వంట చెయ్యొద్దని, అమెరికాలో ఉన్న తెలంగాణ ఆడపడుచులకు పిలుపునిచ్చిన పోచారం శ్రీనివాస రెడ్డి , 
ఈ 4000 ఇచ్చే పథకంతో వ్యవసాయం పండగే అని చెప్తున్నడు.
ఏంటి ఈ దౌర్భాగ్యం ?
 ఏటా 4000 కోట్ల బడ్జెట్ తో ఈ ఎరువుల పథకం అమలు చేస్తానంటున్న ప్రభుత్వం,
 సంవత్సరానికి 3000 కోట్ల బడ్జెట్ తో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసిన మరిసింది.
 *గిట్టుబాటు ధర లేకుంటనే కదా ఈ ఏడాది మిర్చి రైతులు నిండా మునిగింది*.... 
గిట్టుబాటు ధర కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని తప్పించుకుంటూ, 
*రాష్ట్రప్రభుత్వం గతేడాది పత్తి ఎయ్యొద్దు... మిర్చి వెయ్యమని చెప్పి కూడా*, 
*మిర్చి రైతులను గాలికి ఒదిలేసి,రైతన్నల చేతులకు బేడిలు వేసింది.*
            * * * * * * * *  
👆🏻ఈ పోస్టు ఎవ్వరినీ విమర్శించడానికి కాదని గమనించాలి....
 *ప్రజాధనంతో అమలు చేయ్యాలనుకుంటున్న పథకాల్లో ఉన్న లోటు పాట్లను విశ్లేషించడమే ఇక్కడఉద్దేశం.*
 *ఆ ప్రభుత్వం చేసిందా.... అంతకు ముందున్న ప్రభుత్వం జేసిందా అనే ఆర్గ్యుమెంట్లు కాకుండా*..... 
*ఎకరానికి 4000 ఇచ్చే పథకానికి పరిధి పెట్టాలి.*
ఎందుకంటే ..........
మీరు ప్రతిసారి చెప్పుకుంటునది రైతాంగ సంక్షేమమని...
మరి రాష్ట్రంలో *నిరంతరం కష్టపడి వ్వవసాయం చేసే రైతు 5-10 ఎకరాలు మాత్రమే ఉంటది*.
అలా ఉంటేనే రైతు అనవచ్చు.
*వందలు - వేలఎకరాలు ఉన్న వారు భూస్వాము అనబడుతారని* నా అభిప్రాయం.
ఇప్పుడు చెప్పండి ఈ పథకం ఎవరికోసం.
               పృధ్వీ గాదె ✍🏻

No comments