Breaking News

కాంగ్రేస్ ను గెలిపించేందుకు వచ్చే బాహుబలి ఎవరు ?


బాహుబలి - 2019
బాహుబలి సినిమా రెండోబాగం ఇంకా విడుదల కాక ముందే ఈ సినిమాకు తెలంగాణ అసెంబ్లి ప్రచార వేదికగా మారింది. అసెంబ్లి బడ్జెట్ సమావేశాలలో ప్రతి పక్ష నేత జానారెడ్డి బాహుబలి ప్రస్తావన తెచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించేందుకు ఒక బాహుబలి వస్తాడని అనడం అసెంబ్లీలో చర్చకు దారి తీసింది. అధికార ప్రతిపక్ష సబ్యులందరూ ఎవరికి అనుకూలంగా వారు వాదనలు చేశారు. మొత్తానికి జానారెడ్డి విసిరిన రాయి బాగానే తగిలింది. ఇప్పటికే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో  రాజమౌళి పజిల్ అర్దం కాక తలలు పట్టుకుంటే దీనికి తోడు ఇప్పుడు జానారెడ్డి పజిల్ తోడైంది. మీడియా వారు అత్రుత పట్టలేక ఇంతకీ ఆ బాహుబలి ఎవరో తెల్సుకోవాలంటూ జానారెడ్డిని కలిస్తే ‘మీరు నా అంతరార్థాన్ని గ్రహించారేమో అనుకుంటున్నా...’ అన్నారు. మీడియా వారు వదలక పోవడంతో  బాహుబలి బయట ఎక్కడ్నుంచో వస్తాడని అనలేదని, కాంగ్రెస్‌ నుంచే ఒక బాహుబలి వస్తాడని క్లారిటి ఇచ్చారు. ‘‘కాంగ్రెస్‌ నాయకుల్లో ఎవరైనా బాహుబలి కావచ్చు. ఎవరికి వారే బాహుబలి అనుకుంటే తప్పేమీ లేదు. అప్పుడు విజయం మాదే కదా..’’ అని వ్యాఖ్యానించారు. జానారెడ్డి చెప్పిన దాంట్లో క్లారిటి ఉందా లేదా....ఏదైనా నిఘూడార్దం దాగి ఉందా అనే డౌట్ మీడియాకు తీర లేదు.
అయితే జానారెడ్డి వాక్కుపై చర్చ మాత్రం దుమ్మురేగుతోంది. వచ్చే ఎన్నికల్లో జానారెడ్డి వాక్కు నిజమవుతుందా నిజంగా కెసిఆర్ ను ఓడించి కాంగ్రేస్ ను గెట్టెక్కించే బాహుబలి వస్తాడా  2019 వరకు కాని స్పష్టం అయ్యే అవకాశాలు లేవు.
ఆ బాహుబలి ఎవరో కాదు జానారెడ్డే నని కాంగ్రేస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి అన్నారు. 
కట్టప్పలాంటి సీఎం కేసీఆర్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌లోనే ఒకరు బాహుబలిగా బలోపేతం అవుతామని ఎమ్మెల్యే డి.కె.అరుణ అన్నారు. 
నేనే ఆబాహుబలి సంపత్ రెడ్డి
తెలంగాణకు బాహుబలిని తానేనని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ అన్నారు. ఢిల్లీలో బాహుబలి రాహుల్‌ గాంధీ అని పేర్కొన్నారు. తెలంగాణకు బాహుబలి సంపత్‌ అని జానారెడ్డి చెప్పారని వెల్లడించారు.
సత్తాఉన్న వాళ్లెవరూ లేరు.......జగదీశ్ రెడ్డి
కాంగ్రేస్ పార్టీలో సత్తా లేని వాళ్లు ఎవరూ లేరని జానారెడ్డి ఒప్పుకున్నాడని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.

No comments