Breaking News

ఎన్నికల వేల సామాజిక మాద్యమాలపై నియంత్రణ సాధ్యమేనా ?

 


ఎన్నికల సమయంలో మీడియ నియంత్రణ అనేది  ఓ సమస్యగా మారింది.ప్రధాన స్రవంతి మీడియా మాత్రమే ఉన్న సమయంలో మీడియా రంగ నిపుణుల సహాయంతో పెయిడ్ న్యూస్ వార్తలు నిర్ణయించి ఆ వర్తల తాలూకు ఖర్చును అభ్యర్థుల ఖాతాలో వేసే వారు. 

ఇందులో కూడ ఖచ్చితత్వం అనేది ఉండేదికాదు. ఏదో తూతూ మంత్రంగా నిర్ణయించే వారు. ఎందుకంటే ఏది పెయిడ్ న్యూసో లేక ఏది నిష్పక్షపాత వార్తో తెలియడం కష్టం కనుక.

మీడియా సంస్థలు రక రకాల పద్దతుల్లో ఎవరి అంచనాలకు దొరకని రీతిలో పెయిడ్ న్యూస్ ఇస్తుంటాయి. ఈ సమస్య ఇ్పటికి ఉంది. 

ప్రస్తుతం ప్రధాన స్రవంతి మీడియాతో పాటు  వివిద  సామాజిక మాద్యమాలు అనేకం అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఎవరి అభిప్రాయాలు వారు వెల్లడిస్తే ఎవరికి నష్టం లేదు. ఈ వేదికలను అనేక రకాలుగా తమ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు.

స్వతహాగా యూట్యూబ్ వంచి ఛానెళ్లు నడిపే వారితో పాటు రాజకీయ పార్టీలు, నేతలు కూడ ఈ మాద్యమాలను ఉపయోగిస్తున్నారు. ఎన్నికల సమయంలో  వీటిని కట్టడి చేసేందుకు ఎన్నికల కమీషన్ కు ఉన్న హంగులు చాలా తక్కువ. ఏవైనా స్పెసిఫ్క్ గా ఫిర్యాదులు అందితే తప్ప చర్యలకు ఉపక్రమించడం లేదు. 

ఎన్నికల సమయంలో సామాజిక మాద్యమాల్లో రెచ్చి పోయి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎదుటి వారిపై బురదజల్లే విధానాలూ ఎక్కువే. ఎట్లా వీటిని నియంత్రించాలనే విషయంలో విధి విధానాలు లేవు. 


No comments