దేశ రాజధాని ఢిల్లీలో పనిచేస్తున్న తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఓ టివి ఛానెల్ జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్దారించారు. జర్నలిస్టుకు వైద్య చికిత్స ప్రారంభించారు. ఆయన కాంటాక్ట్ హిస్టరి సేకరించి అతిన్ని కల్సిన వారందరిని హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా ఆదేశించారు.పాజిటివ్ సోకిన జర్నలిస్టు ఇటీవల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డినకల్సి ఇంటర్వ్యూ తీసుకున్నారు. దాంతో కిషన్ రెడ్డి ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నారు. పాజిటివ్ సోకిన జర్నలిస్టు తో కల్సి పనిచేసిన తెలంగాణ ప్రాంత జర్నలిస్టులను కూడ క్వారెంటైన్ లో ఉంచారు.
పాజిటివ్ సోకిన జర్నలిస్టు కుటుంబానికి తెలంగాణ ప్రెస్ అకాడమి ద్వారా రూ 20 వేల సహాయం చేసినట్లు అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.చానెల్ యాజమాన్యం రూ. లక్ష ఆర్థిక చేసిందని చెప్పారు.అట్లాగే క్వారెంటైన్ లో ఉన్న ఇతర జర్నలిస్టులకు రూ 10 వేల చొప్పున సహాంయగా వారి బాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశామని చెప్పారు.