Breaking News

వరంగల్ జిల్లా రెడ్ జోన్ లో ఎట్లా ?

కరోనా నియంత్రణకు కేంద్రం ప్రకటించిన జోన్ల జాబితాలో క్లారిటి లేకుండా పోయింది. కరోనా కేసుల తీవ్రత లేని జిల్లాను రెడ్ జోన్ లో చేర్చి తీవ్రత ఉన్న జిల్లాను ఆరేంజ్ జోన్ లో చేర్చడం సమంజసంగా లేదని విమర్శలు వస్తున్నాయి.కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న గద్వాల జిల్లాను ఆరెంజ్‌ జోన్లో చేర్చారు. వారం  రోజులుగా కొత్త కేసులేవీ నమోదు కాని వరంగల్ అర్బన్ జిల్లాను రెడ్ జోన్లో చేర్చడం తో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.గద్వాల ఈ జిల్లాలో 45 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఇద్దరు కోవిడ్ కారణంగా మరణించారు. 14 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గత వారం రోజులుగా జోగులాంబ గద్వాల జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. ఈ జిల్లాలో 1258 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు.తెలంగాణలో ఆరు జిల్లాలు రెడ్ జోన్‌లో ఉండగా.. 18 జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో, 9 జిల్లాలు గ్రీన్ జోన్‌లో ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాలను కేంద్రం రెడ్ జోన్లుగా ప్రకటించింది.
వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా ఇప్పటికైతే నియంత్రణలోనే ఉందని చెప్పవచ్చు. జిల్కొలాలో 27 మంది కరోనా భరిన పడగ 24మంది కోలుకున్నారు. కొత్తగా కేసులు నమోదు కాలేదు. మరో ముగ్గురు పాజిటివ్ పేషంట్లు హైదరాబాద్ గాంధి ఆఆసుపత్రిలో చికిత్సలో ఉన్నారు. పునసమీక్ష చేసి వరంగల్ జిల్లాను ఆరెంజ్ జోన్ పరిదిలో చేరిస్తే కొంత వెసులు బాటుగా ఉంటుందని జిల్లా వాసులు అభిప్రాయ పుతున్నారు.

No comments