భారత దేశంలో కరోనా కేసులు నియంత్రణలో ఉన్నాయని భావించేందుకు వీలు లేదు.కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మే 3 నాటికి (ఆదివారం )కరోనా కేసుల సంఖ్య 40,263కి చేరగా, 1,306 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 10,887 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ కాగా 28,070 మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.మరో వైపు మహారాష్ర్ట, గుజరాత్ లో కేసుల సంఖ్య తగ్గటం లేదు. మహారాష్ర్టలో
12,296 మంది వైరస్ బారినపడగా, 521 మంది ప్రాణాలు కోల్పోయారు.మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య  నియంత్రణలోలేదు. ఈ రాష్ర్టాలలో వేయికి పైగా  కేసులు
నమోదయ్యాయి.