Breaking News

అమెరికా ఆర్మీలో మనోడికి రూ. 1.2 కోట్ల ప్యాకేజి!


జైపూర్భారతీయులకు అమెరికా సైన్యంలో ఉద్యోగం రావడం అంటేనే విచిత్రం అనుకుంటే.. అది కూడా కళ్లు తిరిగే ప్యాకేజి వచ్చింది. జైపూర్‌కు చెందిన మోనార్క్ శర్మ అనే యువకుడికి అమెరికా సైన్యంలోని ఏహెచ్-64ఇ కంబాట్ ఫైటర్ హెలికాప్టర్ యూనిట్‌లో శాస్త్రవేత్తగా ఉద్యోగం వచ్చింది. టెక్సాస్‌లోని ఫోర్ట్ హూడ్‌లోని ప్రధాన కార్యాలయంలో పనిచేసేందుకు అతడికి ఏకంగా రూ. 1.20 కోట్ల వార్షిక ప్యాకేజి దక్కింది. అంటే నెలకు 10 లక్షలు అన్నమాట. అమెరికా ఆర్మీలోకి ఈ సంవత్సరమే ప్రవేశించిన ఈ ఫైటర్ హెలికాప్టర్ల డిజైన్‌ను పరిశీలించడం, వాటిని తనిఖీ చేయడం, ఉత్పత్తి, నిర్వహణ బాధ్యతలను అతడు చూసుకోవాల్సి ఉంటుంది.

2013లో నాసాలో జూనియర్ రీసెర్చ్ ఇంజనీర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన మోనార్క్ శర్మ.. అక్కడి మాస్ కమ్యూనికేషన్ విభాగంలో పనిచేశారు. తర్వాత 2016 మే నుంచి అమెరికా ఆర్మీలోకి ప్రవేశించారు. కొద్ది నెలల్లోనే డిజైనింగ్, రీసెర్చ్ విభాగాల్లో తన నైపుణ్యాన్ని ఆయన నిరూపించుకున్నారు. దాంతో అదే సంవత్సరంలో రెండు ప్రతిష్ఠాత్మమైన మెడల్స్ ఆర్మీ సర్వీస్ మెడల్, సేఫ్టీ ఎక్స్‌లెన్స్ అవార్డు వచ్చాయి. రాజస్థాన్‌లో ఒక ప్రభుత్వోద్యోగి రాకేష్ శర్మ కుమారుడైన మోనార్క్.. ముందునుంచి అంతరిక్ష శాస్త్రం, డిఫెన్స్ పరికరాల రంగంలో ఆసక్తి కలిగి ఉండేవాడు. తనకు భారత సైన్యంలో పనిచేసే అవకాశం రాలేదని, అయితే అమెరికా సైన్యంలో తాను చేసే పనితో స్వదేశానికి మంచిపేరు తెస్తానని తెలిపారు.

No comments