Breaking News

కరోనా రోగానికి ఆయుర్వేదంలో విరుగుడు ఉందా ?

ప్రపంచాన్ని  గడ గడ లాడిస్తున్న కరోనా రోగానికి ఆయుర్వేదంలో విరుడు ఉందా ? ఈ సనాతన పద్దతిని నమ్మే వారు నమ్మని వారు ఉన్నారు. ఆయుర్వేదంలో అవుషదాలు ఉన్నాయంటూ మందు కనిపెట్టారంటూ తరుచూ వార్తలు చూస్తున్నాం. ఇందులో నిజమెంతో అబద్ద మెంతో కాని మరుగున పడిన భారతీయ ఆయుర్వేద వైద్య విధానంలో ప్రకృతి సిద్దమైన కొన్ని చిట్కాలు పాటించి చూస్తే నష్టం లేదని అభిప్రాయ పడేవారున్నారు. వంటింటి చిట్కాలు అనేకం మనం పాటించి మనం చిన్న చిన్న రుగ్మతల నుండి ఉపశమనం పొంది నట్లే కరోనాకు కూడ 
ఆయురివేదం పాటిస్తే నష్టం లేదంటున్నారు.

అల్లం సర్వ రోగాలకి ప్రధాన ఆయుధం. ప్రతీ అనారోగ్యానికి తప్పకుకండా ఆయుర్వేదంలో అల్లాన్ని వాడకుండా ఉండరు వైద్యులు. అల్లంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. కరోనా వైరస్ ముఖ్యంగా రోగ నోరోధక శక్తిని తగ్గించేసి తరువాత మనిషిని శరీరాన్ని మొత్తం కూచింప చేస్తుందని తద్వారా శరీరం పూర్తిగా వైరస్ తో నిండిపోతుందని తెలుస్తోంది. ఎప్పుడైతే మనిషికి రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుందో అప్పుడు ఈ వైరస్ మనిషి శరీరంలో పనిచేసే అవకాశం లేదని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అల్లాన్ని ఎలా తీసుకోవాలి, ఏ పద్దతులలో అల్లాన్ని వాడాలి, అల్లంతో పాటు ఎటువంటి పదార్ధాలు మిళితం చేస్తూ మందులా తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం..
అల్లం ముర్బా ( భావన అల్లం ) పేరు అందరికి తెలిసిందే. ఇది సహజంగా అందరూ వాడుతూనే ఉంటారు. ముఖ్యంగా ఆయుర్వేద షాపులలో లభ్యమవుతూ ఉంటుంది. అలాగే పల్లెల్లో ఎక్కువగా ఇంట్లోనే దీన్ని తయారు చేసుకుంటూ ఉంటారు. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని అందులో తగినంత ఉప్పు , నిమ్మరసం పిండి. దాదాపు 20 నుంచీ 30 రోజుల వరకూ నానబెడుతారు. ఆ తరువాత ఆ ముక్కలని తీసేసి కొంత ఎండలో పెట్టి రోజు ఉదయం పూట, సాయంత్రం, రాతి పడుకునే సమయంలో తీసుకుంటే కరోనా వైరస్ కాదు కదా ఎలాంటి వైరస్ కూడా దరిచేరదు. అలాగే మరొక పద్దతి కూడా నిపుణులు సూచించారు..

అల్లం 2 గ్రాములు తీసుకుని అందులో మరో 2 గ్రాముల మిరియాల పొడి, తగినన్ని తులసి ఆకులు వేసి, అందులో మరికొంచం తాటి బెల్లం ( స్వచ్ఛమైనది) కలుపుకుని కషాయంలో చేసుకుని త్రాగితే ఎంతో మంచిదని కరోనా మాత్రమే కాదు ఎలాంటి భయంకరమైన వైరస్ లు వచ్చినా మనకి ఎటువంటి హాని జరగదని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. మన సనాతన ఆయుర్వేద సూత్రాలు భారతదేశంలో ఉన్నంత వరకూ, భారతీయులు పురాతన వైద్య చిట్కాలని పాటించినంత కాలం ఎటువంటి రోగాలు మనదరి చేరవని సూచిస్తున్నారు.

No comments